టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా క్రికెటర్గా భారత జట్టులోకి అడుగుపెట్టినా విరాట్ కోహ్లీ తక్కువ సమయంలోనే ఒక దిగ్గజ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు అని చెప్పాలి. తనదైన దూకుడు బ్యాటింగ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని ఆకర్షించాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి వికెట్ ఒక్కసారి తీస్తే చాలు అని ప్రతి యువ బౌలర్ భావిస్తూ ఉంటాడు.


 అంతలా విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించాడు. రెండవ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించ బోతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేసి చాలా రోజులు అయిపోయింది అని చెప్పాలి.  విరాట్ కోహ్లీ నుంచి ఒక సాలిడ్ సెంచరీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 అదే సమయంలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అంటే చాలు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు.  కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను అధిగమిస్తాడు. కెప్టెన్గా వికీ పాంటింగ్ 41 శతకాలు చేశాడు. కోహ్లీ కూడా 41 శతకాలతో రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. ఇక నేడు ముంబై లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేస్తే  కెప్టెన్గా 42 సెంచరీలు చేసిన ఆటగాడిగా ఒక అరుదైన రికార్డును సృష్టిస్తాడు  విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: