ముంబయి లో న్యూజిలాండ్‌ తో జరగనున్న రెండో టెస్టు లో గాయాల కారణంగా అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ.. ఈ ముగ్గురూ దూరమయ్యారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) శుక్రవారం మ్యాచ్‌ కు ముందు ప్రకటించింది. "కాన్పూర్‌ లో జరిగిన 1 వ టెస్టు మ్యాచ్ చివరి రోజు సమయంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఎడమ చిటికన వేలికి గాయమైంది. దీంతో అతను ముంబైలో జరిగే 2 వ టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది" అని బీసీసీఐ పేర్కొంది. అలాగే "కాన్పూర్‌లో జరిగిన 1వ టెస్టు మ్యాచ్‌లో ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా కుడి ముంజేయికి గాయమైంది. స్కాన్ చేసిన తర్వాత, అతని ముంజేయి పై వాపు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించబడింది మరియు ముంబైలో జరిగిన 2వ టెస్ట్ నుండి తొలగించబడ్డాడు. " అని జోడించింది.

ఇక కాన్పూర్‌ లో జరిగిన 1 వ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అజింక్యా రహానే ఎడమ స్నాయువు స్ట్రెయిన్‌ కు గురయ్యాడు. అతను పూర్తిగా కోలుకోనందున, అతను ముంబై లో జరిగే 2 వ టెస్ట్‌ కు దూరంగా ఉన్నాడు. అతని పురోగతిని నిశితంగా బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తుంది. అయిన రహానే ఉన్న పేలవ ఫామ్ కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా విమర్శలు వచ్చాయి. అభిమానుల తో పాటుగా.. మాజీ ఆటగాళ్లు కూడా ఇదే చెప్తూ వస్తున్నారు. కాగా, ఔట్‌ ఫీల్డ్ తడిగా ఉండటంతో శుక్రవారం ఉదయం ముంబై లో జరగాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. టాస్ ప్రారంభంలో ఆలస్యం అయిన తర్వాత, పిచ్ తనిఖీకి లోబడి, అది 9:30 గంటలకు మరింత ఆలస్యమైంది, తదుపరి తనిఖీ ఉదయం 11:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: