ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లి స్వయంగా కెప్టెన్‌ గా భారత ప్లేయింగ్ ఎలెవన్‌ లో మూడు మార్పులను ప్రకటించాడు, గాయపడిన త్రయం అజింక్యా రహానే, రవీంద్ర జడేజా మరియు ఇషాంత్ శర్మ స్థానం లో తాను జయంత్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌ లు వచ్చినట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్ తరఫున, సాధారణ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్థానంలో డారిల్ మిచెల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. విలియమ్సన్ గైర్హాజరీలో ఓపెనర్ టామ్ లాథమ్ బ్లాక్‌ క్యాప్‌ కు కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అయితే అవుట్‌ ఫీల్డ్ తడి కారణంగా మొదటి రోజు మొదటి సెషన్‌లో ఆట లేదు. దాంతో ఈ రోజు ఆట 5:30 వరకు పొడిగించబడింది. తొలి టెస్టు డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ 0-0తో సమమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికే ఈ సిరీస్ సొంతం అవుతుంది. కానీ రెండు జట్లలో కీలక మైన ఆటగాళ్లు దూరం అవడంతో... దాని ప్రభావం కొంచెం ఉండవచ్చు. కానీ కివీస్ జట్టులో కెప్టెన్ దూరం అయ్యి.. భారత జట్టులోకి కెప్టెన్ రావడంతో దీని ప్రభావం ఎలా ఉండవచ్చు అనేది చూడాలి.

న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్ (C), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (W), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, విలియం సోమర్‌ విల్లే, అజాజ్ పటేల్

ఇండియా జట్టు : మయాంక్ అగర్వాల్, శుభ్‌ మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (C), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (W), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

మరింత సమాచారం తెలుసుకోండి: