భారత్ - న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ పై వరుణుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. రెండు రోజులుగా ముంబయి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ తెల్లవారు జాము నుంచి వర్షం తెరపి ఇచ్చినప్పటికీ.. మైదానం మాత్రం చిత్తడిగా ఉంది. దీంతో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే సెకండ్ టెస్టు ఫస్ట్ సెషన్ మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఎంపైర్లు టాస్ వేసేందుకు అనుమతించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మైదానం చిత్తడిగా ఉండటం, పిచ్ అనుకూలించకపోవడంతో... ఆట ఆలస్యమైంది. ఆ తర్వాత మరోసారి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అంపైర్లు మరోసారి మైదానం, పిచ్ పరిశీలించారు. కానీ మ్యాచ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. లంచ్ విరామం తర్వాత టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఈ మ్యాచ్‌కు కివీస్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరమయ్యాడు. మోచేతి గాయం మరోసారి తిరగబెట్టడంతో... కివీస్ మేనేజ్ మెంట్ కేన్‌కు విశ్రాంతి ఇచ్చింది. 2021 సీజన్‌లో మోచేతి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా సరే అటు ఐపీఎల్, టీ 20 ప్రపంచ కప్ టోర్నీ ఆడాడు. కేన్ గైర్హాజరీతో టామ్ లాథమ్ ఈ మ్యాచ్‌ కోసం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌ టోర్నీతో పాటు పలు కీలక టోర్నీలను కివీస్ ఆడనుంది. ఇందుకోసమే కేన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు తొలి టెస్టు మ్యాచ్‌లో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన భారత్ జట్టు... చివరి వికెట్ తీయడంతో విఫలమైంది. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ 20 సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... ఈ టెస్టు మ్యాచ్ కూడా గెలిచి... టెస్ట్ సిరీస్‌లో తమదే పై చెయ్యి అని వెల్లడించేలా ఉంది. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ... ముంబై టెస్టు కోసం అందుబాటులో ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: