పొట్టి ప్రపంచ కప్ తర్వాత వెంటనే న్యూజిలాండ్ భారత పర్యటనకు వచ్చింది. కానీ టీ 20 సీరీస్ లో పూర్తిగా తేలిపోయింది. ఆ తర్వాత 2 టెస్ట్ ల సీరీస్ లో మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. దాదాపు ఓటమి కోరల నుండి కివీస్ ఆటగాళ్ళు అసాధారణంగా పోరాడి డ్రా అవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ స్పష్టంగా ఇండియన్ కెప్టెన్ అజింక్యా రహానే అనుభవ లేమి కనబడింది. కెప్టెన్ గా మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నా సరిగా వాడుకోలేక ఫెయిల్ అయ్యాడు. చివరి ఓవర్ లను టైట్ చేసి ఉంటే మ్యాచ్ లో తప్పకుండా ఇండియా గెలిచి ఉండేది. దీనిపై క్రికెట్ ప్రముఖుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నేడు చివరిదైన రెండవ టెస్ట్ ముంబై లోని వాంఖడే స్టేడియం లో జరుగుతూ ఉంది.

ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతను తీసుకున్నాడు. మొదటి టెస్ట్ లో విఫలం అయిన రహానేపై కోచ్ వేటు వేశారు. అయితే అధికారిక సమాచార ప్రకారం గాయం కారణంగా తుది జట్టు నుండి తప్పించినట్లు టీమ్ యాజమాన్యం తెలిపింది. కానీ వాస్తవం అది కాదని... మొదటి టెస్ట్ లో విఫలం కావడమే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో  ట్రోల్స్ వస్తున్నాయి. ఇదే నిజమని తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ జట్టులోకి రావడంతో ఎవరిని తప్పించాలి అన్న ప్రశ్నకు రహానే విఫలం కావడం ప్లస్ అయింది.

పైగా గత టెస్ట్ లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ మరియు అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి తప్పక రహానేను మాత్రమే తప్పించాలి. అందుకే గాయం పేరు చెప్పి రహనేను తప్పించారు. ఇప్పుడు భారత్ జట్టులో పోటీ ఎక్కువగా ఉంది. ఆటతీరు బాగా లేకపోతే ఎవరైనా జట్టులో చోటు కోల్పోవడం ఖచ్చితం. మరి ముందు ముందు రహానే తన ఆటతీరును మార్చుకుని కుర్రాళ్లకు పోటీ ఇవ్వగలడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: