విరాట్ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు. ఎన్నో రోజుల పాటు ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ బ్యాట్మెన్గా కొనసాగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ లూ సాధించిన రికార్డులను సైతం ఎంతో అలవోకగా బద్దలు కొట్టాడు.  ఇక ఇలా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంత సీనియర్ బౌలర్ అయిన సరే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడానికి మాత్రం భయపడిపోతుంటారు అంతలా విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్న ఉంటాడు. కానీ గత కొంత కాలం నుంచి సరైన ఫామ్ లో కనిపించడం లేదు.


 బరిలోకి దిగి భారీగా పరుగులు చేస్తాడు అనుకున్న ప్రతిసారి పేలవ ప్రదర్శనతో కోహ్లీ నిరాశ పరుస్తూనే ఉన్నాడు  ఇక అన్ని ఫార్మాట్లలో కూడా కోహ్లీ ప్రదర్శన ఎంతో పేలవంగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టెస్టులో విరాట్ కోహ్లీ బాగా రాణిస్తారు అని అనుకున్నప్పటికీ మళ్ళీ తక్కువ పరుగులు చేసి వికెట్ సమర్పించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆటతీరుపై  మాజీ ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్.



 విరాట్ కోహ్లీ ఆటతీరులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ టెస్ట్ క్రికెట్లో మళ్లీ తిరిగి అత్యుత్తమ ఫామ్ అందుకోవడానికి ఓపిక ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ ని ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వి.వి.ఎస్.లక్ష్మణ్ సూచించాడు. చాలా రోజుల నుంచి కోహ్లీ మూడంకెల స్కోర్ చేయకుండానే వికెట్ కోల్పోతున్నాడు. కోహ్లీ శతకం కరువు తీర్చు కోవడానికి ఎంతగానో ఓపిక పట్టాలని లక్ష్మణ్ కామెంట్ చేశాడు. ఒకసారి సెంచరీ చేస్తే మళ్లీ ఫామ్ లోకి వచ్చి మునుపటిలా భారీగా పరుగులు చేయగల విశ్వాసం వస్తుందని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

Vvs