ఇటీవలే భారత క్రికెట్ లో కొత్త శకం మొదలైంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు భారత కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో నూతన కెప్టెన్గా రోహిత్ శర్మ నియమించబడ్డాడు. అదే సమయంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో కొత్త కొత్తగా రాహుల్ ద్రవిడ్ పదవీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఎన్నో రోజుల నుంచి రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్గా మారబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది . అదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గా పని చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సిద్ధంగా లేడు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఎట్టకేలకు రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టాడు.



 అయితే రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించడంపై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హెడ్ కోచ్ గా ఉండడానికి రాహుల్ ద్రావిడ్ ను ఒప్పించడం ఎంతో కష్టతరమైనది అంటూ చెప్పుకొచ్చారు. ఒకానొక సమయంలో ఆశలు కూడా వదులుకున్నాము అంటూ తెలిపాడు సౌరబ్ గంగూలీ. శాస్త్రి తర్వాత భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమించాలని నేను జైషా ఎన్నో రోజుల క్రితం అనుకున్నాం ఈ విషయాన్ని సహచర ఆటగాడు రాహుల్ ద్రావిడ్ తో చర్చించాము కాని అతడు టీమిండియా హెడ్ కోచ్ గా ఉండడానికి నిరాకరించాడు.


 అతనికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ఇక కుటుంబానికి దూరంగా ఉండటం కష్టం అంటూ చెప్పేశాడు. అయితే హెడ్ కోచ్ పదవి గురించి ఎన్నిసార్లు రాహుల్ ద్రవిడ్ తో చర్చించినప్పటికీ అతను మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఒకానొక సందర్భంలో ఓపిక నశించి చివరికి రాహుల్ ద్రావిడ్ పై  ఉన్న ఆశలు అన్నీ వదులుకున్నాము. కానీ పదే పదే అడగడం మాత్రం మానలేదు. చివరికి ఆటగాళ్లు కూడా రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ కావాలి అనడంతో చివరికి అంతా వివరించి రాహుల్ ద్రవిడ్ ను టీం ఇండియా కోచ్ గా ఉండేందుకు ఒప్పించానము అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: