టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన ప్పటికీ ఇక ఇటీవల సొంత గడ్డపై జరిగిన వరుస సిరీస్లలో  మాత్రం అదరగొట్టింది అని చెప్పాలి. న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి న్యూజిలాండ్ జట్టును క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. ఇక ఆ ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా భారీ తేడాతో విజయం సాధించడం గమనార్హం. టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి టెస్టు డ్రాగా ముగియడం తో రెండో టెస్టు మ్యాచ్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మారిపోయింది. రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా 372 పరుగుల తేడాతో విజయం సాధించింది.


 ఇక టీమిండియా ఘన విజయం సాధించడంపై ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు ఈ క్రమంలోనే టీమిండియా భారీ విజయం పై హర్షం వ్యక్తం చేశారు అయితే ఒక విషయం మాత్రం నిరాశకు గురి చేసింది అంటూ చెప్పుకొచ్చారు   టెస్ట్ సిరీస్ విజయంతో ముగించడం ఎంతో బాగుంది కానీ కాన్పూర్లోని ఆఖరి వికెట్ తీయలేకపోయాం. అదే కాస్త నిరాశకు గురి చేసింది అంటూ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. జట్టు ఎంతో అద్భుతంగా ఆడింది. జట్టులోని ఆటగాళ్లకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. కఠిన పరిస్థితుల్లో కూడా బాగా పుంజుకొని ఆడారు. సీనియర్లూ లేకపోయినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు అంటూ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు.



 అయితే రెండో ఇన్నింగ్స్ లో తొలుత డిక్లేర్ చేయాలని అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్.  ఆట లో చాలా సమయం మిగిలి ఉంది. న్యూజిలాండ్ ను ఎలాగైనా అలౌట్ చేస్తామని నమ్మకం కూడా ఉంది.. అయితే ఎర్రమట్టి వికెట్పై బంతి ఎంతగానో బౌన్స్ అవుతున్న సమయంలో బ్యాటింగ్ చేయడం యువకులను మరింత మేటి ఆటగాళ్లు గా తీర్చిదిద్దుతుంది అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారని ఇది కొంచెం ఆందోళన కలిగించింది అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: