ఇటీవలే సొంతగడ్డపై భారత్ న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ భారత్ న్యూజిలాండ్ కూడా ఎంతో కీలకం గా మారిపోయింది. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ లో గెలిస్తే  వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ లో భారీగా పాయింట్ సాధించే అవకాశం ఉంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే  భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత జట్టు సొంతగడ్డపై అదరగొట్టింది.. న్యూజిలాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం లేకుండా క్లీన్ స్వీప్ చేసింది.



 ఆ తర్వాత భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభమైంది. ఇక ఈ టెస్ట్ సిరీస్లో  న్యూజిలాండ్ భారత్  హోరాహోరీగా తలపడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో  భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్లు కనిపించింది. దీంతో టీమిండియా అలవోకగా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ భారత బౌలింగ్ విభాగం పూర్తి వికెట్లు తీయడంలో విఫలం కావడంతో చివరికి మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది.


 దీంతో భారత్ న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో  జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మారిపోయింది. రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎంతో అద్భుతంగా రాణించింది టీమ్ ఇండియా. బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం రాణించింది. ఇక ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్ డ్రాగా ముగియడం తో మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది టీమ్ ఇండియా.  ఇటీవలే రెండో టెస్ట్ మ్యాచ్ లో 372 పరుగుల తేడాతో గెలవడంతో ఇక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇక భారత రాంకింగ్స్ లో మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది. 124 పాయింట్లతో టాప్ లో నిలిచింది.. 121 పాయింట్లతో న్యూజిలాండ్ జట్టు రెండవ స్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: