భారత్ - సౌతాఫ్రికా టూర్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వైరస్ కారణంగా భారత పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. తాజాగా భారత టూర్ షెడ్యూల్‌ను రివైజ్ చేస్తు కొత్త షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి.. బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ సేన... సఫారీ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఈ పర్యనటు ముందుగా అనుకున్నట్లు డిసెంబర్ 17వ తేదీ నుంచి కాకుండా... డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆడాల్సిన ట్వంటీ 20 సిరీస్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇదే విషయాన్ని కోల్‌కతా వేదికగా జరిగిన వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా రివైజ్డ్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే సందర్భంగా తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. సెంచూరియన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జోహన్నెస్ బర్గ్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కు కేప్ టౌన్ వేదిక కానుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. జనవరి 19, 21, 23 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి రెండు వన్డేలకు పార్ల్‌ సిటీ స్టేడియం వేదిక కానుంది. చివరి వన్డే కేప్ టౌన్‌లో జరగనుంది. భారత్ జట్టు తమ హిస్టరీలో కేవలం దక్షిణాఫ్రికాలో మాత్రమే టెస్టు సిరీస్ గెలుచుకోలేదు. టెస్టు హోదా అన్ని దేశాల్లో కూడా సిరీస్ గెలుచుకుంది. కోహ్లీ సేన ఈ సారి అయినా ఆ లోటు భర్తీ చేస్తుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే వన్డే సారధ్య బాధ్యతలు కూడా రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది ఇప్పుడు. మరి సిరీస్ ముందు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: