ఇప్పుడు క్రికెట్ ప్రేమికులందరూ వచ్చే ఐపీఎల్ సీజన్ 15 ఎలా ఉండనుంది. ఏ ఏ జట్లలో ఏ ఆటగాళ్లు ఉండనున్నారు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. గత సీజన్ వరకు కొనసాగిన ఎనిమిది ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను రెటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మిగిలిన ఆటగాళ్లను జనవరిలో జరగబోయే మెగా వేలంలో దక్కించుకుంటారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లకు ఈ మెగా వేలంలో నిరాశ దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఆటగాళ్లెవరో ఒకసారి చూద్దాం.

సురేష్ రైనా

చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యంత విలువైన ఆటగాడిగా ఎన్నో సంవత్సరాలుగా తన సేవలను అందిస్తూ వచ్చాడు. చెన్నై అన్ని టైటిల్స్ నెగ్గడంలో సురేష్ రైనా వన్ డౌన్ బాట్స్మన్ గా చేసిన పరుగులే కారణం అని చెప్పాలి. అయితే 2019 సీజన్ కు కుటుంబ కారణాల వలన దూరం కావడం మరియు గత సీజన్ లో ఆడినా అంతగా రాణించకపోవడం వంటి పలు కారణాల చేత సురేష్ రైనాకు ఈ సారి ఫ్రాంచైజీల నుండి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా చెన్నై రైనాను రీటైన్ చేసుకోవడంలోనూ ఆసక్తి చూపలేదు.

దినేష్ కార్తీక్

ఇండియా జాతీయ జట్టుకు కీపర్ మరియు బాట్స్మన్ గా ఆడిన అనుభవం ఉన్న దినేష్ కార్తీక్ నిలకడ లేమితో అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోవడంలో విఫలం అయ్యాడు. అయితే ఐపీఎల్ లో  ఒ మోస్తరుగా రాణిస్తూ వచ్చిన దినేష్ కార్తీక్ కు ఐపీఎల్ లోని కేకేఆర్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. గంభీర్ అకారణంగా తప్పుకోవడంతో ఆ కెప్టెన్సీ పదవి కార్తీక్ ను వరించింది. అయితే కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న ఒకటిన్నర సంవత్సరం కనీసం తన ఆటతీరు కానీ కెప్టెన్ గా జట్టు తీరును మార్చడంలో పూర్తిగా ఫెయిల్ య్యాడు. కాబట్టి దినేష్ కార్తీక్ ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఇష్టపడకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: