ఇటీవల సొంత గడ్డపై టీమిండియా అద్భుతంగా రాణించ్చింది అనే చెప్పాలి. వరుసగా ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుతో టి20 టెస్ట్ సిరీస్ ఆడింది భారత జట్టు. ఇక రెండు సిరీస్ లలో కూడా న్యూజిలాండ్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం సాధించింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో అయితే భారీ విజయాన్ని సాధించి మరో సారి వరల్డ్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది టీమిండియా. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం సిద్ధమైంది.


 సౌతాఫ్రికాలో ఇటీవలి కాలంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా లేదా అన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ బిసిసిఐ సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుంది అన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది.  ఈ క్రమంలోనే టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనకు బయలుదేర పోతుంది. అయితే ఇక ఈ పర్యటనకు ముందే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా టీమిండియా కు దూరం అయినట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో రవీంద్ర జడేజా గాయం బారిన పడ్డాడు.



 దీంతో మొదటి టెస్టు మొత్తానికి దూరం అయ్యాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అయితే రవీంద్ర జడేజా ఇప్పట్లో కోలుకునే  అవకాశం కూడా లేదట. దీంతో సౌత్ ఆఫ్రికా పర్యటనకు కూడా రవీంద్ర జడేజా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. జడేజా గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది అని సమాచారం. అయితే రవీంద్ర జడేజా తో పాటు శుభమన్ గిల్,అక్షర్ పటేల్,  ఇషాంత్ శర్మ లు కూడా సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: