ప్రస్తుతం భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టుకు రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన ఏకైక భారత కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు. అయితే ఇప్పటివరకూ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన  ధోని కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు.



 ప్రస్తుతం టీమిండియా లో కొనసాగుతున్న క్రికెటర్ల కంటే అటు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఎంతో సక్సెస్ఫుల్గా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. మహేంద్రసింగ్ ధోని  కెప్టెన్సీ లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక ఐపీఎల్ లో దిగ్గజ జట్టు గా కొనసాగుతుంది. ధోనీ సారథ్యంలో  సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.


 ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రావో ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని పై పొగడ్తల వర్షం కురిపించాడు బ్రావో. ప్రపంచ క్రికెట్కు ధోనీ అంబాసిడర్ అంటూ బ్రావో వ్యాఖ్యానించాడు. ధోని తాను సోదరులు లాంటి వాళ్ళం అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు.. తమ మధ్య ఎంతో బలమైన స్నేహబంధం ఉంది అంటూ తెలిపాడు. కాగా మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో  ఆడిన  బ్రావో ఇటీవలే మెగా వేలం లోకి వదిలివేయబడ్డాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: