ఇండియన్ క్రికెట్ కు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఎన్నో ఏళ్ల కిందటే టీమిండియా జట్టులో స్థానం కోల్పోయాడు హార్భజన్ సింగ్. ఆ తర్వాత మళ్లీ పునరాగమనం చేయలేకపోయాడు. ఇక ఈ 41 ఏళ్ల ఆటగాడు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్లలో ఆడుతూ తన సత్తా చాటుకున్నాడు హర్భజన్ సింగ్. అయితే ఇక వచ్చేవారం అధికారికంగా హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అనీ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.


 దీనికి కారణం హర్భజన్ సింగ్ కు వస్తున్న మంచి ఆకర్షణీయమైన ఆఫర్లే అని టాక్ వినిపిస్తుంది. హర్భజన్ సింగ్ను ఐపిఎల్ ఫ్రాంచైజీలు బౌలింగ్ కన్సల్టెంట్ లేదా మెంటర్, కోచ్ లాంటి పదవులు అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నారట.  ఇలా వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఇక ఫ్రాంచైజీకి ఉపయోగపడతాడని ఫ్రాంచైజీ భావిస్తోందట. అయితే హర్భజన్ సింగ్ ఎప్పుడూ యువ ఆటగాళ్లకు ఎంతో విలువైన సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఇప్పటివరకు యువ క్రికెటర్లు అయిన వరున్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ లాంటి యువ ఆటగాళ్లకు ఎన్నో సలహాలు ఇచ్చాడు హర్భజన్ సింగ్.


 ఈ విషయాన్ని స్వయంగా ఆ యువ ఆటగాళ్లే చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక వచ్చే వారం తన క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంఛైజీల లో ఒకరితో కలిసి పని చేయబోతున్నారట. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ ను సపోర్ట్ స్టాప్ గా తీసుకోవడానికి ఒక ఫ్రాంచైజీ ప్రస్తుతం ఎంతగానో ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు వరకు టీమిండియా తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు హర్భజన్ సింగ్. ఇక టెస్టుల్లో 417 వికెట్లు సాధించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: