విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే భారత జట్టుకు కెప్టెన్. టీ20, వన్డే ఫార్మాట్ల న్యాయకత్వ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే సౌత్ ఆఫ్రికా టూర్‌ టెస్ట్ జట్టును ఎంపిక చేస్తూ... బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుని వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు, కానీ బీసీసీఐ మరియు సెలెక్టర్లు దానిని సముచితంగా పరిగణించలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఒకే ఒక్క కెప్టెన్ ఉండాలని కోరుకొని... రోహిత్‌ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే వన్డే కెప్టెన్సీని తన నుండి తీసుకున్న తర్వాత... విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ లో ఆడటం లేదు అనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా సమాచారం ప్రకారం... దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుండి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ తర్వాత... జనవరి 19 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇది పూర్తి సమయం కెప్టెన్‌ గా రోహిత్ శర్మ యొక్క మొదటి వన్డే సిరీస్. అలాగే కోహ్లీకి కెప్టెన్సీ పోయిన తర్వాత మొదటి వన్డే సిరీస్. అయితే తాను వన్డే కెప్టెన్ గా ఉండాలి అనుకున్న తొలగించడంతో... కోహ్లీ ఈ సిరీస్ కు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సౌత్ ఆఫ్రికాలో తలపడే టెస్ట్ జట్టు ను ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ వన్డే జట్టును కూడా ప్రకటించిన తర్వాత దీని పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ నాలుగున్నరేళ్ల పాటు వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు మరియు ఈ సమయంలో అతను 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలిచాడు. అతని గెలుపు శాతం 70.43 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: