చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో ఎంతలా పరుగుల వరద పారించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలవడం లో రుతురాజ్ గైక్వాడ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఇప్పుడు దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్  ఒకవైపు జట్టును కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఒక రకంగా జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు అని చెప్పాలి.


 వరుసగా  సెంచరీలతో చెలరేగి పోతున్నాడు.  ఇక విజయ్ హజారే ట్రోఫీ ద్వారా పరుగుల దాహం తీర్చుకుంటున్నట్లు గానే కనిపిస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలు బాది అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. ఇటీవలే చండీగర్ తో ముగిసిన లీగ్ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. 95 బంతుల్లో ఏకంగా సెంచరీ కొట్టి అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు.. లీగ్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలో ఏకంగా నాలుగు మ్యాచ్ లలో సెంచరీ కొట్టాడు.



 ఇక ఇటీవల చేసిన సెంచరీతో ఒక అరుదైన ఘనత సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు రుతురాజ్ గైక్వాడ్. ఇప్పటివరకు ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, దేవదత్త పడిక్కాల్, పృద్వి షా మాత్రమే ఉన్నారు.. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్  కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. ఇక వరుస సెంచరీలతో చెలరేగిన పోతున్న రుతురాజ్ గైక్వాడ్ సెలెక్టర్లకు  ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ను వెంటనే టీమిండియాలో సెలెక్ట్ చేయాలి అంటూ ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసేలోపు రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.  రుతురాజ్ బాగా రాణిస్తూ ఉండటంతో ధోని మాత్రం ఫుల్ హ్యాపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: