ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి అటు సోషల్ మీడియాలో ఎంతగానో క్రేజు ఉంది. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ కి సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియా లోకి వస్తే అది క్షణాలు వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు క్రికెట్కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఉంటారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం తన ఫ్యామిలీ అప్డేట్స్ ను ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  ఇక ఈ దంపతులు ఏదైనా పోస్టు పెట్టారు అంటే అది అందరినీ ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇకపోతే ఇటీవలే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పెట్టిన ఒక వీడియో కాస్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో చూసి అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇక ఈ వీడియోలో ప్రేక్షకులు ఊహించని విధంగా కొత్త భాషలో మాట్లాడాడు విరాట్ కోహ్లీ.. సాధారణంగా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడటం మాత్రమే చూశాము. కానీ పంజాబీ భాషలో మాట్లాడగలడు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే విరాట్ కోహ్లీ ఢిల్లీలో పుట్టినప్పటికీ అతడిది పంజాబీ హిందూ ఫ్యామిలీ.


 దీంతో కోహ్లీ పంజాబీ భాష కూడా నేర్చుకున్నాడు అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఫుట్బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ప్రీమియర్ లీగ్లో తన అభిమాన జట్టు మాంచెస్టర్ సిటీ టాప్ లో దూసుకెళ్తు ఉండడంతో  విరాట్ కోహ్లీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలోనే ఇటీవల మాంచెస్టర్ సిటీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. ముందుగా శుభాకాంక్షలు ఇంగ్లీషులో చెప్పిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత పంజాబీలో మాట్లాడాడు. మాంచెస్టర్ సిటీ జట్టు అద్భుతాలు సృష్టించి ఇంకా ఎన్నో టైటిల్స్ గెలుచుకోవాలని ఆకాంక్షించాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: