ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్యమైన ఘట్టంలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొందరు పెద్దలు చేసిన పెళ్లిళ్లు చేసుకుంటారు, మరి కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రేమ అనేది ఎవరితో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా కలగొచ్చు. సినీ సెలబ్రిటీలు స్టార్ క్రికెటర్లను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. పలువురు సినీ సెలబ్రిటీలు క్రికెటర్లను ప్రేమించి పెళ్ళిచేసుకుని ఒకటయ్యారు. ఎంతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి జంటల గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చేది బాలీవుడ్ బ్యూటీ అనుష్క, భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

బ్యూటిఫుల్ సెలబ్రిటీ జంటగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ఓ ఇండియన్ క్రికెటర్ ప్రేమలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఇరువురు ఒకరినొకరు బాగా అర్దం చేసుకుని ఇపుడు పెళ్లి పీటలు ఎక్కాలని డిసైడ్ అయ్యారట. అయితే ఇదే విషయాన్ని వారి ఇంట్లో చెప్పగా హీరోయిన్ ఇంట్లో ఒకే గానీ ఆ క్రికెటర్ ఇంట్లో ససేమిరా అంటున్నారట, అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారట. దాంతో  వారిద్దరూ సందిగ్ధంలో పడ్డారట. ప్రస్తుతానికి ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉంటూ వీలైనంత త్వరగా ఎలాగైనా ఒప్పించి వివాహం చేసుకోవాలని తెగ ఆరాట పడుతోందట  ఆ జంట.

ఓ ప్రముఖ నిర్మాతతో ఆ క్రికెటర్ ఇంట్లో మాట్లాడించి ఒప్పించే ప్రయత్నం చేస్తోంది ఆ హీరోయిన్ అని తెలుస్తోంది. వీలైనంత త్వరగా వారిని ఒప్పించి ఈ విషయాన్ని ప్రకటించి అందరి మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ ప్రేమ పక్షులు. మరి వారి ప్రేమ... పెళ్లి పీటలెక్కి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం. ప్రస్తుతానికి వారిద్దరూ ఎవరు అన్నది సస్పెన్స్. అతి త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అధికారికంగా తెలియచేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: