సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకు సోషల్ మీడియాలో ఎంతగానో క్రేజ్ ఉంటుంది. క్రికెట్ ఆటగాళ్లు ఏం చేసినా కూడా క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది క్రికెట్ ఆటగాళ్లు  సినిమా హీరో లకు సంబంధించిన డైలాగులపై యాక్టింగ్ చూస్తూ పాత్రలపై డాన్సులు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప.

 రా కంటెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా చూసిన తర్వాత ఎవరిని చూసినా కూడా పుష్ప సినిమాలోని డైలాగులు చెబుతూ ఉండటం గమనార్హం  సోషల్ మీడియాలో కూడా పుష్ప సినిమా డైలాగులపై ఎంతోమంది యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఏకంగా ఒక భారత స్టార్ ఆల్రౌండర్ ప్రస్తుతం పుష్ప సినిమాలోని ఒక పవర్ ఫుల్ డైలాగ్ పై యాక్టింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది.


 ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని తగ్గేదిలే డైలాగ్ తనదైన శైలిలో యాక్టింగ్ చేసి అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. పుష్ప పుష్పరాజ్ నీయవ్వ తగ్గేదెలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్  తనదైన శైలిలో చెప్పిన అదరగొట్టాడు రవీంద్ర జడేజా. అయితే ఈ డైలాగ్ సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: