ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. సౌత్ ఆఫ్రికా వేదికగా మూడు టెస్టుల సిరీస్ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ఇప్పటికే కోహ్లీ సారథ్యంలో టెస్టు సిరీస్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియా సెంచరియన్  వేదికగా ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఇకపోతే అటు టీమ్ ఇండియా జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరడానికి ముందే అటు రోహిత్ శర్మ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకుంటూ గాయం నుంచి కోలుకున్నాడు.



 ఈ గాయం కారణంగా ఇప్పటికే టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ వన్డే సిరీస్కు అందుబాటులో కి వస్తాడా లేదా అన్న దానిపై చర్చ జరగగా రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ కూడా అందుబాటులో ఉండడు అన్న విషయం ఇటీవల వెల్లడైంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో మళ్లీ వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీ అప్పచెప్పే అవకాశం ఉంది అని అందరూ భావించారు. కానీ అనుకోని విధంగా ఎంతో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు అప్పగించింది బిసిసీఐ. ఇక వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాకు వైస్ కెప్టెన్గా జస్ప్రిత్ బుమ్రా ను ఎంపిక చేశారు.


 విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్గా నియమిస్తారు అనుకుంటే బిసిసీఐ ఇలా చేసింది ఏంటి అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ ఖాన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఇకపై పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదు. జట్టు యాజమాన్యం వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్నే స్టాండింగ్ కెప్టెన్ గా నియమించింది. అతనికి ఐపీఎల్ లో ఒక జట్టుకు నాయకత్వం వహించే అనుభవం కూడా ఉంది. అయితే ఈ జట్టులో వైస్ కెప్టెన్ గా ఉన్న ఆటగాడికి అవసరం వచ్చినప్పుడు స్టాండింగ్ కెప్టెన్గా నియమించే పద్ధతి ధోనీ కెప్టెన్గా ఉన్న నాటి నుంచే కొనసాగుతూ వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ భట్.

మరింత సమాచారం తెలుసుకోండి: