గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న తీరు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కానీ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలిపించుకోలేక పోయాడు. దీంతో కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ వచ్చాయి. ఐతే ఇలా డిమాండ్ చేసినందుకా లేక తనకు ఇష్టంతో నేనా అన్నది తెలియదు కానీ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఆ తర్వాత బీసిసిఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తపిస్తూ షాక్ ఇచ్చింది. ఇక వన్డే కెప్టెన్సీ తపించే ముందు సమాచారం ఇవ్వలేదు  విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్ లో  చెప్పడంతో కెప్టెన్సీ మార్పు వ్యవహారం కాస్తా వివాదంగా మారిపోయింది.



 ఇక ప్రస్తుతం వన్డే, టి20 లకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కేవలం టెస్ట్ లకు  మాత్రమే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే బీసీసీఐ  తీరుపై ఆగ్రహంతో ఉన్న విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరంగా ఉంటాడు అనే టాక్ వినిపించింది. కానీ అలాంటిదేమీ లేదు అన్నది మాత్రం తెలిసిపోయింది. టెస్ట్ జట్టును ముందుండి నవ్వుతూనే నడిపిస్తున్నాడు కోహ్లీ.అంతా బాగానే ఉంది కానీ కోహ్లీ ప్రెస్ మీట్లకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అయితే తన వందో టెస్టు రోజు విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడని అప్పటివరకూ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు అంటూ ఇటీవలే  జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


 దీంతో అందరిలో మరో కొత్త ప్రశ్న మొదలైంది. ఇన్ని రోజుల వరకూ జట్టు ఓడినా గెలిచినా ప్రెస్ మీట్ నిర్వహించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు.. మరీ ముఖ్యంగా 100వ టెస్టు రోజా ఎందుకు ప్రెస్ మీట్ నిర్వహించాలి అనుకుంటున్నాడు.. విరాట్ కోహ్లీ ఏదైనా కీలక ప్రకటన చేయబోతున్నాడా.. అసలు కోహ్లీ మనసులో ఏముంది. బీసీసీఐ తీరుపై ఆగ్రహంతో విరాట్ కోహ్లీ కొంపతీసి టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోబోతున్నాడా.. లేక ఇంకేదైనా కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడా అన్నది ప్రస్తుతం అభిమానులందరిలో ఉత్కంఠగా మారింది. కాగా జనవరి 11వ తేదీన కోహ్లీ కేప్ టౌన్ వేదికగా ఆడబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: