సాధారణంగా ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ఆటలో కొనసాగినప్పుడు మాత్రమే కాదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులకు దగ్గర గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్ ఎప్పుడో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కేవలం క్రికెట్కు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు సచిన్ టెండూల్కర్.



 అయితే ఇటీవల సచిన్ టెండూల్కర్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సచిన్ టెండూల్కర్ కూడా తన ఆల్ టైం బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే సచిన్ టెండూల్కర్ ప్రకటించిన ఈ జట్టులో భారత సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి స్థానం కల్పించక పోవడం గమనార్హం. అదే సమయంలో భారత క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న ఎంఎస్ ధోని కి కూడా స్థానం కల్పించలేదు సచిన్ టెండూల్కర్. వీరిద్దరిని మాత్రమే కాదు ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లకు కూడా జట్టులో స్థానం కల్పించకపోవటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఇక ఇటీవల సచిన్ టెండూల్కర్ ప్రకటించిన జట్టులో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సునీల్ గవాస్కర్ లను ఎంచుకున్నాడు.  వన్‌డౌన్‌లో బ్రియాన్ లారా, టూ డౌన్‌లో వివ్‌ రిచర్డ్స్ ఎంపిక చేసుకున్నాడు. ఐదో స్థానంలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్, ఆరో ప్లేస్‌లో సౌరవ్ గంగూలీ సెలెక్ట్ చేసాడు సచిన్ టెండూల్కర్. వికెట్‌కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ జట్టులోకి తీసుకున్న సచిన్.. స్పిన్నర్ల కోటాలో హర్భజన్‌ సింగ్‌, షేన్ వార్న్‌, పేసర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను తన జట్టులో స్థానం కల్పించాడు.  అయితే ద్రవిడ్, పాంటింగ్, మురళీధరన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్ లకు సచిన్ తన జట్టులో స్థానం కల్పించకపోవడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: