జోహ‌న్నెస్ బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్ట్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఓట‌టి పాలైంది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ (96 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడి త‌న జ‌ట్టును విజ‌యానికి చేర్చాడు. ఈ విజ‌యంతో మూడు టెస్ట్ సిరీస్‌1-1తో స‌మాన‌మైంది. సిరీస్‌లో చివ‌రి టెస్ట్ మ్యాచ్ జ‌న‌వ‌రి 11న ప్రారంభం అవుతుంది. సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్ట్‌లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ టెస్ట్‌లో విజ‌యం సాధించేందుకు రెండ‌వ ఇన్నింగ్స్‌లో 240 ప‌రుగులు సాధించాల్సిన ద‌క్షిణాఫ్రికా మూడ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  118/2 వ‌ద్ద ఉంది.

నాలుగ‌వ రోజు చేతిలో 8 వికెట్లు 122 ప‌రుగుల ల‌క్ష్యంతో నాలుగ‌వ రోజు బ‌రిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు వ‌రుణుడు స్వాగ‌తం ప‌లికాడు. దీంతో తొలి రెండు సెష‌న్ల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిది. అయితే మూడో సెష‌న్ స‌మ‌యానికి వ‌ర్షం ఆగిపోవ‌డంతో తిరిగి ఆట ప్రారంభ‌మైంది. సెష‌న్ ప్రారంభం కాగానే డెస్స‌న్ (40) వికెట్ తీసిన ష‌మీ టీమ్ ఇండియా విజ‌యంపై ఆశ‌లు రేకెత్తించాడు. కానీ కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్, తెంబా బ‌వుమా(23) భార‌త అబిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు.

ప‌ట్టుద‌ల‌తో ఆడిన ద‌క్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో భార‌త్‌పై విజ‌యం సాధించింది. ఎల్గ‌ర్ (188 బంతుల్లో 96 నాటౌట్‌) భార‌త బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారి విజయంలో కీల‌క పాత్ర పోషించాడు. బౌన్సి పిచ్‌పై 240 ప‌రుగుల ల‌క్ష్యం చిన్న‌దేమి కాక‌పోయినా.. బ‌ల‌మైన పునాది వేసుకున్న ద‌క్షిణాఫ్రికా అధ్బుత‌మైన బ్యాటింగ్ కొన‌సాగింది. డ‌సెన్ భార‌త భౌల‌ర్లు బుమ్రా ఓవ‌ర్‌లో పోర్, ష‌మీ, శార్దూల్  ఓవ‌ర్ల‌లో రెండు పోర్లు కొట్టాడు. 175 వ‌ద్ద డ‌స్సెన్ వికెట్ తీసిన ష‌మి కాస్త  ఉత్సాహాన్ని ఇచ్చినా.. ఆఅవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని భార‌త్ ఒత్తిడి తేలేక‌పోయింది. భార‌త బౌల‌ర్లు ఎంత ప్ర‌య‌త్నం చేసినా కానీ ఎల్గ‌ర్‌ను వెన‌క్కి పంపించ‌లేక‌పోయారు. తొలి ఇన్నింగ్‌లో 7 వికెట్లు తీసిన శార్దూర్ ఠాకూర్ ఈసారి త‌న ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. ఖాతా తెర‌వ‌క‌ముందే బువుమా ఇచ్చిన రిట‌ర్న్ క్యాచ్‌ను శార్దూర్ చేజార్చాడు. ఆ క్యాచ్ ప‌ట్టుంటే ఆతిథ్య జ‌ట్టుపై భార‌త్ ఒత్తిడి తేగ‌లిగేదేమో..! కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న డీన్ ఎల్గ‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: