ఇప్పటివరకు సౌత్ఆఫ్రికా పర్యటనలో టీమిండియా ఒక్కసారి కూడా సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన దాఖలాలు లేవు. భారత జట్టుకు కెప్టెన్ లు మారుతున్నారు తప్ప సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించాలి అన్న  కల నెరవేరడం లేదు. అయితే ఈసారి కోహ్లీసేన బ్యాటింగ్ బౌలింగ్లో ఎంతో పటిష్టంగా కనిపించింది. దీంతోసౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించడం పక్క  అని టీమిండియా అభిమానులందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ అటు టీమిండియా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ.. జట్టులో కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోయింది.



 దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా జట్టుపై ఆధిపత్యం సాధించి భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా అభిమానులందరూ ఎంతగానో మురిసిపోయారు. ఇక ఇదే జోరు కొనసాగిస్తూ రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించాలని అనుకుంది టీమిండియా. ఇక టీమిండియాకు ఎంతో కలిసివచ్చే జోహన్నెస్బర్గ్ వేదిక రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో టీ మీడియా కు తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్లో ఓటమి పాలై కసితో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు టీమిండియాకు రెండో టెస్టులో షాక్ ఇచ్చింది.


 ఎన్నో ఆశలతో సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్లో బరిలోకి దిగిన టీమిండియా కు ఎదురుదెబ్బ తగిలింది.రెండవ టెస్ట్ మ్యాచ్లో చివరికి ఓటమి తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది టీమిండియా. ఏడు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టు టీమిండియాపై ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఎల్గర్ 96 పరుగులు తో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ స్కోర్ 202, 266.. కాగా సౌత్ ఆఫ్రికా 229, 243/3  పరుగులు చేసి విజయం సాధించింది. ఇక ఇరు జట్లు చెరో టెస్టు మ్యాచ్లో గెలవడంతో ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా కొనసాగుతోంది. దీంతో మూడో టెస్ట్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది. జనవరి 11వ తేదీన మూడో టెస్టు ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: