సౌత్ ఆఫ్రికా పర్యటనకు భారత్ వెళ్తుంది అన్నపాటి నుండి... జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. మొదట ఓపెనర్ గిల్, జడేజా గాయపడగా... ఆ తర్వాత పర్యటనకు ఒక్క రోజు ముందు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయం బారిన పడ్డాడు. దాంతో ఈ ముఖ్య ఆటగాళ్లు లేకుండానే.. సౌత్ ఆఫ్రికా వెళ్లిన భారత జట్టు అక్కడ మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక గత ఏడాది నుండి రాణించలేకపోతున్న అజింక్య రహానే, పుజారా ఏ మ్యాచ్ లో కూడా విఫలమయ్యారు. ఇదిలా ఉంటె.. నిన్న ప్రారంభమైన రెండో టెస్ట్ ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా గాయం బారిన పడటంతో.. రాహుల్ చేతికి పగ్గాలు వచ్చాయి. అలాగే ఈ మ్యాచ్ కు దూరమవుతున్నారు అనుకున్న రహానే, పుజారాలకు తుది జట్టులో స్థానం దక్కింది. అయిన కూడా ఈ మ్యాచ్ లో వీరు నిరూపించుకోలేకపోయారు. మొదై ఇన్నింగ్స్ లో పుజారా కేవలం మూడు పరుగులు చేయగా... రహానే గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో వీరు మరోసారి అభిమానుల ఆగ్రహాన్ని గురయ్యారు.

ఇంత దారుణంగా విఫలమవుతున్నా... వీరిద్దరికి ఇంకా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని అభిమానులు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ ఇద్దరికి గాయాలైనా బాగుండని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కెరీర్ ముగిసినట్లేనని ట్రోల్ చేస్తున్నారు. పుజారా, రహానే జట్టుకు అందించిన సేవలు చాలని, ఇంకా వీరిని భరించే శక్తి తమలో లేదని అంటున్నారు. వెంటనే వీరి స్థానంలో శ్రేయర్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి పుజారా 19 టెస్ట్‌ల్లో 25.52 సగటుతో 868 రన్స్ మాత్రమే చేయగా... ఇందులో ఒక్క సెంచరీ కూడా లేదు. ఇక రహానే 35 ఇన్నింగ్స్‌ల్లోని దాదాపు 12 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో మిగిలి ఉన్న సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా ఈ ఇద్దరు పరుగులు చేస్తారా.. లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: