ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మూడవ టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా భారత జట్టు సిద్ధమైపోయింది. ఈక్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి టీం విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు అనుకున్న కె.ఎల్.రాహుల్ ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇటీవలే గాయం బారి నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ భావిస్తున్నారు.

 అయితే ఎప్పుడూ అద్భుతమైన శతకాలతో అదరగొట్టే విరాట్ కోహ్లీ దాదాపు రెండేళ్ల నుంచి శతకం అనే పదానికి మైళ్ల దూరం లోకి వెళ్ళిపోయాడు. దీంతో విరాట్ కోహ్లీ నుంచి ఒక సాలిడ్ ఇన్నింగ్స్ కావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి సెంచరీ లోటును తీర్చాలి అంటూ సోషల్ మీడియా కోరుతున్నారు ఎంతోమంది అభిమానులు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ లో తప్పకుండా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదే విషయంపై అటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 మూడవ టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులుగా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న సెంచరీ కూడా సాధిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై ధీమా వ్యక్తం చేశాడు. రెండేళ్ల నుంచి సెంచరీకి దూరమైపోయిన విరాట్ కోహ్లీ మూడవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం తప్పకుండా సెంచరీ చేస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్. అంతే కాకుండా రెండో టెస్టులో అర్థసెంచరీ సాధించి మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు అనిపించిన అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా సైతం బాగా రాణిస్తారని చెప్పుకొచ్చాడు సీనియర్ ఆటగాళ్లు రాణించడం టీమిండియాకు శుభపరిణామం అంటూ వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: