టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ విన్నర్ ను తెల్చే మ్యాచ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈసారి టెస్టు సిరీస్లో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది టీమిండియా. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లలో కూడా ఇరు జట్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాయ్. దీంతో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ 1-1 కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇక కేప్టౌన్ వేదికగా నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నారు అందరూ.



 ముఖ్యంగా గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ మూడో టెస్ట్ మ్యాచ్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాడు అని భావించారు. అతని బ్యాటింగ్ పై ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. కాని కేఎల్ రాహుల్ మాత్రం అందరినీ నిరాశపరిచాడు.. సెంచరీ చేసి అదరగొడతాడు అనుకున్న కె.ఎల్.రాహుల్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులందరూ నిరాశలో  మునిగిపోయారు. 12 వ ఓవర్లలో ఒలివర్ వేసిన బంతికి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి  చివరికి నిరాశపరిచాడు. ఇక అంతలోనే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం 15 పరుగులతో పరుగులతో వికెట్ చేజార్చుకున్నాడు.



 అయితే కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై మాత్రం ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్రంట్ ఫుట్ కి వెళ్లే కె.ఎల్.రాహుల్ సహజ ధోరణి గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్ నేటి రోజుల్లో బ్యాట్స్మెన్లు క్రీజు ను ఉపయోగించుకోవడం ఎందుకు కష్టమో వివరించాడు. నేటి రోజుల్లో ప్రతి బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చే ఆడుతున్నారు. స్లో మోషన్ రిప్లై లేదు చూసినప్పుడు ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. బంతి వేయకముందే కె.ఎల్.రాహుల్ ఫ్రంట్ ఫుట్  కి వచ్చేశాడు. ఆ సమయంలో మీరు బ్యాక్ ఫుట్ లోకి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేరు. మీరు ఫ్రంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అక్కడే తప్పు చేస్తున్నారు. కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే కె.ఎల్.రాహుల్ అవుటయ్యాడు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: