భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం  అన్నీ సిద్ధమవుతున్నాయి. ఇక 2022 సీజన్లో మెగా వేల నిర్వహిస్తూ ఉండటం తో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు అంతకు ముందు ఉన్న జట్లల్లో కాకుండా వేరే జట్ల లోకి వెళ్ళే అవకాశం ఉంది. దీంతో ఏ జట్టు ఎలా రాణించ బోతుంది అన్నది కూడా అంచనాలకు అందని విధంగా ఉంది. అదే సమయంలో ఇక ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక కొత్త జట్ల ఐపీఎల్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 మరీ ముఖ్యంగా ప్రస్తుతం మెగా వేలంలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఫ్రాంచైజీ ల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో అన్నది మరింత ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో మెగా వేలం ఎప్పుడు నిర్వహిస్తారో అని అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 మెగా వేలానికి బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీలలో ఈ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక రెండు రోజులపాటు ఈ మెగా వేలం నిర్వహించబోతున్నారట.



 దీంతో ఇక ఈ మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఐపీఎల్ ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై బిసిసిఐ ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. గతంలో కరోనా వైరస్ కేసులు పెరిగినప్పటికీ అటు భారత్ వేదికగానే ఐపీఎల్ నిర్వహిస్తామంటూ సూత్రప్రాయంగా చెప్పింది బిసిసిఐ. మరి రానున్న రోజుల్లో కేసులు పెరిగితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ కుదిరితే ఒకే రాష్ట్రంలో కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోందట. లేదంటే మళ్లీ యూఏఈలో నిర్వహించాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl