ప్రపంచ క్రికెట్ లో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి విరాట్ కోహ్లీ తన ఆటతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. భారత క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ ప్రతి మ్యాచ్ కూడా తనకు మొదటి మ్యాచ్ అన్నట్లుగానే ఎంతో కసితో ఆడుతుంటాడు. అంతేకాకుండా ఇప్పటికే ఎన్నో పరుగులు చేసినప్పటికీ దాహం తీరలేదు అన్నట్లుగా భారీ స్కోర్లు చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే అభిమానులు ముద్దుగా విరాట్ కోహ్లీ ని పరుగుల యంత్రం అని పిలుచుకుంటారు.


 ఇక మరికొంతమంది రికార్డుల రారాజు అని పిలుచుకుంటారు. ఇక ఇవన్నీ పేర్లు ఊరికే రాలేదు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డును తక్కువ సమయంలోనే సాధించి విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకవైపు జట్టుకు కెప్టెన్గా అద్భుతంగా జట్టును ముందుకు నడిపిస్తున్న మరోవైపు కీలక ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రాణిస్తూ వస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు అటు ఫీల్డింగ్ లో కూడా విరాట్ కోహ్లీ తనకు తానే సాటి అంటూ ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేస్తూ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.



 ఇలా మైదానంలో మెరుపు ఫీల్డింగ్  తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా 100 టెస్ట్ క్యాచ్ లు అందుకుని సరికొత్త మైలురాయిని అధిగమించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు భారత క్రికెట్ లో టెస్టుల్లో అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ మాత్రమే 100 క్యాచ్ లు అందుకున్న ఆటగాళ్లు గా ఉన్నారు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: