ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. టెస్ట్ సిరీస్లో భాగంగా వరుసగా టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ముగియగా ఇప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యి ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి విజేతగా నిలిస్తే వారే సిరీస్ కైవసం చేసుకోనున్నారు. ఇకపోతే జోహన్నెస్బర్గ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగింది . ఈ టెస్ట్ మ్యాచ్లో జస్ప్రిత్ బూమ్రా సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  బూమ్రా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్  వరుసగా బౌన్సర్లు  సంధించాడు. ఈ క్రమంలోనే జస్ ప్రీత్ బుమ్రా ఎంతో అసహనంతో జాన్సన్ మీదికి దూసుకు వెళ్లడం ఇద్దరి మధ్య కాసేపటి వరకు వాగ్వాదం జరగడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ గొడవ ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ జస్ప్రిత్ బూమ్రా  మాత్రం మనసులోనే ఉంచుకున్నాడు. ఇక ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీశాడు. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించున్నాడు జస్ప్రిత్ బూమ్రా. రెండవ టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా బౌన్సర్లు సంధించి తన ను ఇబ్బందులకు గురి చేసిన మార్కో జాన్సన్ ను  క్లీన్ బౌల్డ్ చేశాడు.
 దీంతో తన పవర్ ఏంటో చూపించాడు జస్ప్రిత్ బుమ్రా. రెండవ రోజు టీ విరామం అనంతరం సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్క్ జాన్సన్ బ్యాటింగ్  చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస బౌన్సర్ లతో జస్ప్రిత్ బూమ్రా  అతని భయపెట్టాడు. ఇక ఆ తర్వాత బూమ్రా సూపర్ డెలివరీకి జాన్సన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో వికెట్ చేజార్చుకున్న మార్కో జాన్సన్  కనీసం జస్ప్రిత్ బూమ్రా  వైపు చూడకుండా  పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక ఇది చూసిన తర్వాత బూమ్రా దెబ్బకు దెబ్బ తీసుకున్నాడు. బూమ్రా తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ ఎంతో మంది అభిమానులు అనుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: