టీమిండియాలో కి దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఇప్పుడు తన పేలవమైన ఫామ్  ఇండియాకు మైనస్ గా మారిపోతుంది. గత కొంత కాలం నుంచి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. తక్కువ స్కోర్ లకే వికెట్ చేజార్చుకునీ పెవిలియన్ చేరుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలి అనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియాకు పంత్ ఫామ్ మాత్రం ఎంతగానో కలవరపెడుతోంది.


 గత రెండు టెస్టు మ్యాచ్ లలో కూడా పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ని పక్కన పెట్టి మరో ఆటగాడికి  అవకాశం కల్పించాలంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా  కల కలగానే మిగిలిపోతుంది అని అంటున్నారు. అయితే పంత్ ఫామ్ పై మాట్లాడిన విరాట్ కోహ్లీ అతనికి బలహీనతలను అధిగమించేందుకు కొంత సమయం ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి కాస్త భరోసా కల్పిస్తే అద్భుతంగా ఆడగలడు అంటూ బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.


 రిషబ్ పంత్ ఎంతో నాణ్యమైన ఆటగాడే కానీ ఇటీవల తరచూ స్కోర్ లకే వికెట్ చేజార్చుకుంటూ వెనుదిరుగుతున్నాడు. ఇది అందరికీ చిరాకు తెప్పిస్తుంది. జోహాన్నెస్బర్గ్లో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అయితే అనవసరమైన షాట్ ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు.  దీంతో అతని పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే అతను ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని మానసికంగా కొంచెం దైర్యం అందించి నీ వెంట మేమున్నామని భరోసా కల్పిస్తే పంత్ చెలరేగి ఆడుతాడు అంటూ బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: