ఇటీవల సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్లో చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో టీమిండియా కు మళ్లీ నిరాశే ఎదురైంది. మొదటి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియాకు ఆ తర్వాత మ్యాచ్ లోనే ఎదురుదెబ్బ  తప్పలేదు. ఇక ఇటీవలే విజేతను నిర్ణయించే మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా పై పైచేయి సాధించిన సౌతాఫ్రికా జట్టు విజయం సాధించి మరోసారి విజయ పరంపర కొనసాగించింది. ఇక ఈ సారి సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాకు మళ్లీ నిరాశే ఎదురైంది.



 ఇదిలా ఉంటే.. టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉందని ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ థర్డ్ అంపైర్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మూడోరోజు ఆట లో భాగంగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేసిన సమయంలో ఎల్గర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బంతి ప్యాడ్ లకు తాకడంతో రవిచంద్రన్ అశ్విన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు.


 ఈ క్రమంలోనే వెంటనే రివ్యూ కి వెళ్ళాడు ఎల్గర్. రివ్యూలో చూసుకుంటే బంతి వికెట్ల కంటే కాస్త పైనుంచి వెళ్లినట్టు కనిపించింది. దీంతో థర్డ్ ఎంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఇక ఈ నిర్ణయంతో అటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు. అంతేకాదు థర్డ్ అంపైర్ నిర్ణయం పై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. స్టేంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరు పారేసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ తోపాటు కె.ఎల్.రాహుల్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఘాటుగానే ఉన్నాయి అని చెప్పాలి.. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఐసీసీ విరాట్ కోహ్లీ పై నిషేధం విధించే అవకాశం ఉంది అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. స్టేంప్స్ మైక్ దగ్గరికి వెళ్లిన విరాట్ కోహ్లీ ' కేవలం ప్రత్యర్ధి జట్టు మీదే.. కాదు మీ జుట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: