గత కొంత కాలం నుంచి టీమిండియాకు టెస్టు జట్టు ఎంపిక పెద్ద సవాల్ తో కూడుకున్నది గా మారిపోయింది. ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరం గా కేవలం టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా  కొనసాగుతున్న ఆటగాళ్లు ఇటీవల కాలంలో పేలవమైన ప్రదర్శన చేస్తూ ఉండడంతో అటు టీమిండియాకు ఎంతగానో మైనస్ గా మారిపోతుంది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ లలో  కూడా టీమిండియా ఓటమి చవి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా కొనసాగుతున్నరూ అజింక్యా రహనే, చటేశ్వర్ పుజారా లు.


 అయితే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ అయినప్పటికీ వీరి ఫామ్ మాత్రం టీమిండియాను కలవరపెడుతుంది. గత కొంత కాలం నుంచి ఎవరికి  ఇవ్వనని అవకాశాలను బీసీసీఐ వీరికి ఇచ్చింది. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వీరికి మాత్రం జట్టులో స్థానం కల్పిస్తూ వచ్చింది.  ఎప్పుడో ఒకసారి తప్పితే వీళ్లిద్దరు పెద్దగా రాణించలేదు. పూజారా రెండేళ్లుగా  సెంచరీ చేయలేదు. ఇక రహనే ఎంత పేలవమైన ఫాంలో కొనసాగుతున్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు పేలవమైన ప్రదర్శన చేస్తూ తక్కువ పరుగులకే  వికెట్లు చేజార్చుకుంటూ ఉండటంతో టీమిండియా విజయవకాశాలు పై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీనికి ఇటీవలే టీమిండియా చేజార్చుకున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఒక ఉదాహరణ చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు గా పేరున్న వీరిద్దరూ మెరుగ్గా రాణించి ఉంటే దక్షిణాఫ్రికా సిరీస్లో టీమిండియా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించేది అని  ఎంత మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఇప్పుడు ఇదే విషయంపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ కు హనుమ విహారి అవసరం వచ్చింది అంటూ వ్యాఖ్యానించాడు గౌతం గంభీర్.. రహానేను బీసీసీఐ ప్రోత్సహించినట్లు గానే హనుమ విహారి కి  అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. రెండు మూడు టెస్టు సిరీస్ ల వరకు అయినా హనుమ విహారి కి  అవకాశాలు ఇవ్వాలని అతను ఒక అద్భుతమైన ఆటగాడు అంటూ గౌతం గంభీర్ తెలిపాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: