భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్ల నుంచి బ్యాటింగ్ లో తన మార్క్ ను చూపించలేకపోతున్నాడు. 2019 లో తన చివరి సెంచరీ చేసిన ఈ రన్ మిషన్ వరుస వైఫల్యాల కారణంగా విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్ లో ఒత్తిడికి లోనవడంతో భారత టీ20 కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుండి కూడా బీసీసీఐ తప్పించింది. కానీ వాటిని లెక్క చేయకుండా.. తన గేమ్ పైన మాత్రమే ఫోకస్ చేసిన విరాట్ ప్రస్తుతం కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాప్రికాతో జరగుతున్న మూడో టెస్టులో 79 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేయగల్గింది. అయితే విరాట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు,1 సిక్స్‌ ఉంది. ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ వేసిన రబడా బౌలింగ్‌లో.. బౌన్సర్‌ని సిక్స్‌గా కోహ్లి మలిచాడు. అయితే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒకే సిక్స్‌ నమోదైంది. అది కూడా కోహ్లిదే కావడం విశేషం.

అయితే తాజా నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ సిక్స్ లు బాదడంలో చాలా వెనకబడి ఉన్నాడు. ఎంతంటే... 2019 నుంచి టెస్టు క్రికెట్‌లో కోహ్లి నాలుగు సిక్స్ లు మాత్రమే కొట్టగా.. ఈ మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కొట్టింది తనకు ఐదవ సిక్స్ మాత్రమే. కానీ ఇదే సమయంలో.. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ 31 సిక్స్ లతో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే మయాంక్‌ 25, పంత్‌ 18 సిక్స్‌లతో విరాట్ కంటే ముందున్నారు. అయితే ఇక్కడే గమనించాల్సిన విషయం ఏంటంటే... టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా 11 సిక్స్‌లతో ఈ జాబితాలో కోహ్లి కన్న ముందు నిలిచాడు. ఇక ఇది ఇలా ఉంటే.. సఫారీలతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒంటరి పోరాటంపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: