ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మల తెలుగు సినిమాల ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది క్రికెటర్లు తెలుగు డైలాగులను, పాటలను రీ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువగా పుష్ప సినిమాకు సంబధించిన పాటలను రీ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంతు వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళీ రాజమౌళీ తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్... ఈ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన.. కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటించింది.

అయితే ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాటు నాటు వీర నాటు సాంగ్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్‌కు సినీ ప్రేమికులంతా ఫిదా అయ్యారు. దాంతో చాలా మంది ఈ పాటను రీక్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్  రాజస్థాన్ రాయల్స్ కూడా వచ్చింది. ఈ సాంగ్ స్టెప్స్‌ను తమ ఆటగాళ్లతో రీ క్రియేట్ చేసింది రాజస్థాన్. రామ్‌చరణ్‌లా జోస్ బట్లర్.. ఎన్టీఆర్‌లా యశస్వీ జైస్వాల్‌ ఫేస్‌లను ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. rrr పాటకు RR ప్లేయర్ల ఆట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్‌ను మాత్రమే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కరోనా మహమ్మారి నేపథ్యం లోనే వాయిద పడిందన్న సంగతి మన అందరికీ తెలిసిందే.  ఇక తర్వలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: