ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికాతో మూడో టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లోనే భారత సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ కమ్ రిషభ్ పంత్ (139 అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇందులో అజేయ సెంచరీతో చెలరేగిన పంత్.. సఫారీ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 139 బంతులు ఎదుర్కోగా.. అందులో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్‌.. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.

అయితే 2010-11 సౌతాఫ్రికా పర్యటనలో ధోనీ సెంచూరియన్ వేదికగా 90 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే ఓ ఆసియా వికెట్ కీపర్ యొక్క అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజాగా రిషభ్ పంత్ దాన్ని అధిగమించాడు. ధోనీనే కాకుండా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(89), బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్(70) ను కూడా వెనక్కినెట్టాడు. కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన పంత్‌.. అన్నింటినీ పేసర్లకు అనుకూలించే పిచ్‌లపైనే సాధించడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌కు ముందు నిలకడలేని ఫామ్, నిర్లక్ష్యపు షాట్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్.. తన ఆటతోనే సమాధానమిచ్చాడు. షాట్ సెలెక్షన్ మార్చుకోవాలని, దూకుడు తగ్గించుకోవాలని సీనియర్లు, సహచరులు, కోచ్‌లు చెప్పినా.. తన ఆటను మార్చుకునేది లేదంటూ... సెంచరీతో చెప్పాడు. ఇక పంత్ శతకం కారణంగానే టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల ఫైటింగ్‌ టార్గెట్‌ను ఉంచగలిగింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: