ప్రస్తుతం భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో ఏకంగా రెండు ప్రపంచకప్ లను సాధించాడు. ఇకపోతే ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతూ ఉండటం అభిమానులందరికీ కాస్త ఊరట కలిగించింది అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి, ఐపీఎల్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పు కుంటాడు  అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతాడు అంటూ జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా నే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని జట్టును నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం 2022 సీజన్లో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు అని అర్థమవుతుంది.



 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ధోని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. ధోని వారసుడిగా రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022 సీజన్లో సీఎస్కే జట్టును కెప్టెన్గా నడిపించబోతున్నాడని  టాక్ వినిపిస్తోంది. ఇక సొంత మైదానంలోనే పూర్తిగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని భావించిన ధోని.. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకుని ఇక రవీంద్ర జడేజాను కెప్టెన్గా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకోబోతున్నాడట మహేంద్రసింగ్ ధోని. అందుకే ఇక ధోని సూచన మేరకే రవీంద్ర జడేజాను తొలి ప్రాధాన్యత ఆటగాడిగా 16 కోట్లకు జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీకి కేవలం 12 కోట్లకు తీసుకుంది. దీంతో 2022 సీజన్లో మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కాకుండా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడట. ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: