టీమిండియాలో ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇటీవలే కెప్టెన్గా గుడ్ బాయ్ చెప్పేసాడు. గతంలో టి20 వరల్డ్ కప్ కి ముందు తాను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించి  విరాట్ కోహ్లీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ను టి20 లకు కొత్త కెప్టెన్గా బిసిసిఐ నియమించింది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించి ఇక వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కూడా రోహిత్ శర్మ కు అప్పగించింది. ఇలా విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం పెద్ద వివాదంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 కోహ్లీ బిసిసిఐ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రెస్మీట్లో చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కేవలం టెస్ట్ కెప్టెన్సీకి మాత్రమే పరిమితం అయ్యాడు. ఈక్రమంలోనే టెస్టు కెప్టెన్గా సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా బరిలోకి దిగాడు విరాట్ కోహ్లీ. ఈ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ విజయం సాధించి సత్తా చాటి సరికొత్త చరిత్ర సృష్టించాలనుకున్న విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. సిరీస్ టీమ్ ఇండియాకు చేజారిపోయింది. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓడిన 24 గంటల తర్వాత తాను కెప్టెన్సీ నుంచి కూడా తప్పు కుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించి ఊహించని షాక్ ఇచ్చాడు.


 ఇక ఇన్నాళ్ళ వరకు తనకు సహకరించిన బిసిసిఐకి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించాడు. అయితే సిరీస్  ఓడిపోయిన తర్వాత జట్టు ఆటగాళ్లు అందరితో కలిసి సమావేశం నిర్వహించాడట. తన రిటైర్మెంట్ ప్రకటించే దాదాపు 24 గంటల ముందు ఈ విషయాన్ని ముందుగానే ఆటగాళ్లకు చెప్పాడట. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ చెప్పడంతో ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న వారు ఆశ్చర్యానికి గురయ్యారట. అందరిని ఒక చిన్న సహాయం అడుగుతున్నాను దయచేసి డ్రెస్సింగ్ రూం బయట ఎవరితోనో ఈ విషయంపై చర్చించ వద్దు అంటూ విరాట్ కోహ్లీ ఆటగాళ్లను రిక్వెస్ట్ చేశాడట. ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్ సమావేశం లో ఉన్న కొంత మంది ఆటగాళ్లు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: