ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ చేజార్చుకున్న టీమ్ ఇండియా భారత క్రికెట్ అభిమానులను కూడా నిరాశ పరిచింది. ఇలా టీమిండియా ఓటమి తో నిరాశలో ఉన్న అభిమానులకు లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది కుర్రాళ్ల జట్టు. ప్రస్తుతం టీమిండియా అండర్ 19 జట్టు అండర్-19 ప్రపంచకప్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్లో భాగంగా ఇటీవల సౌత్ ఆఫ్రికా తో మొదటి మ్యాచ్ లో తలపడింది.. ఈ క్రమంలోనే భారత కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు.  ఎక్కడా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే నలభై ఐదు పరుగుల తేడాతో టీమిండియా అండర్-19 జట్టు విజయం సాధించడం గమనార్హం.


 46.5 ఓవర్లు ఆడిన టీమిండియా ఆల్ అవుట్ అయ్యి  232 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ముందు 233 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. అయితే అటు భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సఫారీల బ్యాటింగ్ విభాగం  చేతులెత్తేసారు అనే చెప్పాలి. ఇక తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో 45.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 187 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నలభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా అండర్ 19 జట్టు. దీంతో అటు భారత అభిమానులందరి లో కూడా ఉత్సాహం నిండిపోయింది అని చెప్పాలి.


 ఒకవైపు భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓడిపోతే మరోవైపు భారత అండర్ 19  జట్టు మాత్రం అదే దక్షిణాఫ్రికాపై మొదటి మ్యాచ్లో విజయం సాధించి ప్రపంచకప్ లో భోని కొట్టింది. భారత జట్టు విజయం సాధించడంలో జట్టు కెప్టెన్ యష్ కీలకం పాత్ర వహించాడు. ఏకంగా 82 పరుగులతో రాణించాడు. ఇక ఆ తర్వాత రషీద్ 31 పరుగులతో రాణించాడు.  దీంతో జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. అదే సమయంలో భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించడంతో ఇక భారత్ పై విజయం సాధించడానికి సౌత్ ఆఫ్రికా కు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: