రెండు సంవత్సరాల క్రితం వరకు ఇంగ్లాండ్ మాజీలు కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కానీ టెస్ట్ లకు ఉత్తమ కెప్టెన్ గా జో రూట్ దొరికాడని ఎంతో పొంగిపోయారు. ఇక దాదాపు పది సంవత్సరాల వరకు రూట్ జట్టును ముందుండి విజయవంతంగా నడిపిస్తాడని అనుకున్నారు. అయితే గత సంవత్సరం నుండి ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ గాడి తప్పిందని చెప్పాలి. ఇండియాతో ఆడిన సిరీస్ లోనూ తడబడిన ఇంగ్లాండ్ మొన్ననే ముగిసిన యాషెస్ సిరీస్ లో దారుణంగా విఫలం అయి ప్రపంచం లోని క్రికెట్ ప్రముఖుల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో జరిగిన 2021-22 యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా 4-0 తో చేజిక్కించుకుంది.

అటు ఇంగ్లాండ్ కానీ ఇటు ఆస్ట్రేలియా అభిమానులు యాషెస్ సిరీస్ ను ప్రపంచ కప్ తో సమానంగా భావిస్తారు. అందుకే ఈ ఓటమిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటిలాగే ఒక జట్టు ఓటమి పలు కావడానికి ప్రధమ కారణం ఆ జట్టును ముందుండి నడిపిన కెప్టెన్ దే అవుతుంది. అదే విధంగా ఇంగ్లాండ్ జట్టును ఓటమి దిశగా నడిపిన జో రూట్ దే పూర్తి బాధ్యత అవుతుంది. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం జో రూట్ ను కెప్టెన్ గా తొలగించడానికి చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇందుకు కొందరు మాజీల నుండి విముఖత వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రూట్ మాత్రం జట్టును ముందుండి నడిపించడానికి మొగ్గు చూపుతున్నాడు. ఈ విషయం రూట్ స్వయంగా చెప్పడం గమనార్హం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఒక్క సిరీస్ విఫలం అయినందుకు ఈసీబీ రూట్ ను తొలగిస్తుందా లేదా ఇంకో అవకాశం ఇచ్చి కనికరిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: