ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఏ జట్టు లో ఏ ఆటగాడు ఉంటాడు.. ఏ జట్టు ఏ మేరకు ప్రదర్శన చేయగలుగుతుంది అన్న విషయంపై దాదాపు ప్రేక్షకులందరికీ ఒక అంచనా  ఉండేది. కానీ ఇప్పుడు ఆ అంచనాలు తారుమారు కాబోతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి.. అంతేకాకుండా ఇక ఐపీఎల్ మెగా వేల నిర్వహిస్తుండటం గమనార్హం. దీంతో మొన్నటి వరకు ఒకే జట్టును అంటిపెట్టుకొని వున్న ఆటగాళ్లు ఇక ఇప్పుడు ఏ జట్టు లోకి వెళ్ళబోతున్నారూ అన్నది కూడా కూడా ఊహకందని విధంగానే ఉంది. అదే సమయంలో స్టార్ ఆటగాళ్లు సైతం మెగా వేలంలో ఉన్నారు.


 దీంతో ఇక ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచబోతుంది అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఐపీఎల్ లోకి కొత్తగా అహ్మదాబాదు, లక్నో జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే అంతకుముందు ఐపీఎల్ లో ఉన్న జట్ల మాదిరిగానే తమా జట్టును కూడా పటిష్టంగా మార్చుకునేందుకు మెగా వేలం కి ముందే తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి ఆయా జట్ల ఫ్రాంచైజీలు. జట్టు కెప్టెన్ తో పాటు ఇక రిటైన్ చేసుకుని మరో ముగ్గురు ఆటగాళ్లను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగా వేగంలో ఉన్న సార్ ఆటగాళ్లతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.



 అయితే గత కొంత కాలం నుంచి అహ్మదాబాద్ జట్టు కెప్టెన్గా మారిపోయేది ఎవరు. ఇక రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది.  ఇప్పుడు ఇద్దరు స్టార్ ప్లేయర్లను అహ్మదాబాద్ జట్టు రిటైన్ చేసుకునేందుకు సిద్ధమైంది అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా... తన స్పిన్ మాయాజాలంతో మ్యాజిక్ సృష్టించి రషీద్ ఖాన్ లను అహ్మదాబాద్ జట్టు రిటైన్ చేసుకునేందుకు సిద్ధమైందట. దీని కోసం ఏకంగా 15 కోట్లు చెల్లించనుందట అహ్మదాబాద్ ఫ్రాంచైజ్.. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl