ఎప్పుడు భారత క్రికెట్ లో జరిగే పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే గౌతం గంభీర్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ గుడ్ బై చెప్పడం పై స్పందించిన గౌతమ్ తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్రస్తుతం భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పైన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాల్సిన  అవసరం ఎంతైనా ఉంది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఇక ఇటీవల స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కెప్టెన్సీ ఎవరికీ జన్మహక్కు కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతం గంభీర్. కెప్టెన్సీ ఎవరి జన్మ హక్కు కాదు మహేంద్రసింగ్ ధోని లాంటి దిగ్గజ ఆటగాడి నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. భారత క్రికెట్లో ఎన్నో సాధించి.. 3 ఐసీసీ ట్రోఫీలు.. నాలుగు ఐపీఎల్ కప్పులు గెలుచుకున్న ధోని ఇలాంటి దిగ్గజ క్రికెటర్ ఎలాంటి భేషజాలకు పోకుండా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత కూడా కోహ్లీ సారథ్యంలో ఆడాడు.


 కోహ్లీ కూడా అలాగే జట్టులో కొనసాగాల్సిన అవసరం ఉంది. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల టాస్ వేయడం, మైదానంలో ఫీల్డర్లను మోహరించడం విషయంలో మాత్రమే మార్పు వస్తుంది. అంతకుమించి జట్టులో పెద్ద మార్పు ఏమీ కనిపించదు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ లో ఉత్సాహం, ఆట పట్ల అంకితభావంలో ఇక ఇప్పుడు కెప్టెన్గా తప్పకుండా తర్వాత కూడా మార్పు ఉండదు అని అనుకుంటున్నాను.. ఏ ఆటగాడి కైనా సరే దేశం కోసం ఆడటంకు మించిన గౌరవం ఏమీ ఉండదు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.. కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు కోసం ఎంతగానో శ్రమించాడు కోహ్లీ. విజయం కోసం ఎన్నో కలలు కన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత బ్యాటింగ్ పై దృష్టి పెట్టి జట్టుకు విజయం అందించడం కోసం పోరాడాల్సిన   అవసరం ఉంది అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: