ఐపీఎల్ అంటే ఇక హంగామా. ముఖ్యంగా ఇండియా లో ఐపీఎల్ కోసం సంవత్సరం నుండి ఎదురు చూస్తూనే ఉంటారు. సరిగ్గా ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటి నుండి ఇక సంబరాలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించబడ్డాయి మరియు కొన్ని తిరగరాయబడ్డాయి. 20 ఓవర్లు సాగే ఈ క్రికెట్ సంగ్రామంలో ప్రతి బంతికి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మొన్నటికి ఐపీఎల్ మొత్తం 15 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 16 వ సీజన్ ను మొదలు పెట్టడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధానంగా ప్రపంచమంతా కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్లేయర్స్ కు అన్ని విధాలుగా రక్షణ కల్పించే విధంగా బీసీసీఐ చర్యలను తీసుకుంటోంది. అయితే రేపు నెల అనగా ఫిబ్రవరి 12 మరియు 13 వ తేదీలలో బెంగుళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భర్తీ కోసం కసరత్తులు మొదలు పెట్టాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక అతగాడి కోసం రెండు జట్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు నెలల నుండి దాదాపుగా అన్ని క్రికెట్ దేశాలలో దేశవాళీ లీగ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే.

కాబట్టి అన్ని జట్ల కోచ్ ల దృష్టి అంతా వీరిపై కేంద్రీకరించి బాగా రాణించిన ఆటగాళ్లతో మంతనాలు కూడా జరిపారట. ఇప్పుడు అని ఫ్రాంచైజీలు సీనియర్ ఆటగాళ్ల కన్నా యంగ్ ప్లేయర్స్ ను దక్కించుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ లో జరుగుతున్న సూపర్ స్మాష్ టోర్నమెంట్ లో కుర్రాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. వెల్లింగ్టన్ జట్టుకు చెందిన మైఖేల్ బ్రేస్ వెల్ ఒక ఇన్నింగ్స్ లో కేవలం 65 బంతుల్లో 11 ఫోరులు మరియు 11 సిక్సర్ల సహాయంతో 141 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు ఇతనికోసం రాజస్థాన్ రాయల్స్ మరియు కేకేఆర్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ సరి ఐపీఎల్ వేలంలో కుర్రాళ్ళ పంట పండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: