బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన‌ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్న‌ర్ కామెరాన్ బోయ్స్ డ‌బుల్ హ్యాట్రిక్‌తో మెరిసి రికార్డునే సృష్టించాడు. బీబీఎల్‌లో ఈ ఘ‌న‌త సాధించిన బోయ్స్‌ తొలి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఓవ‌రాల్ గా టీ-20 క్రికెట్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెట‌ర్‌గా నిలిచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు.  సిడ్నీ థండ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్  ఏడ‌వ  ఓవ‌ర్లోని చివ‌రి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ త‌రువాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్ వేశాడు బోయ్స్. అప్పుడే ఆరంభం అయింది అస‌లు రికార్డుల వ‌ర్షం. 9వ ఓవ‌ర్‌లో వేసిన  వ‌రుస మూడు బంతుల్లో జాస‌న్ సంఘా, అలెక్స్ రాస్‌, డేనియ‌ల్ సామ్స్‌ల‌ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు.  

వ‌రుస‌గా బంతుల్లో నాలుగు వికెట్లు తీసి బిగ్‌బాష్‌లో తొలి బౌలర్‌గానే రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.  అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయ‌డం ద్వారానే హ్యాట్రిక్ సాధించిన బోయ్స్‌.. బీబీఎల్ ఈ ఘ‌న‌త సాధించిన ఎనిమిదో బౌల‌ర్ కావ‌డం విశేషం. ఆ త‌రువాత బంతికీ మ‌రొక వికెట్ తీసి డ‌బుల్ హ్యాట్రిక్  ఘ‌న‌త సాధించాడు. తాను వేసిన మూడ‌వ ఓవ‌ర్‌లో మ‌రొక వికెట్ తీసిన బోయ్స్ ఓవ‌రాల్‌గా నాలుగు ఓవ‌ర్ల‌లో క‌లిపి  21 ప‌రుగులు ఇచ్చి.. ఐదు వికెట్ల‌ను తీసాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సాధార‌ణంగా హ్యాట్రిక్ అంటే మూడు వ‌రుస బంతుల్లో మూడు వికెట్లు తీయ‌డం అని మ‌నంద‌రికీ తెలుసు. డ‌బుల్ హ్యాట్రిక్ అంటే వ‌రుస‌గా ఆరు వికెట్లు తీయ‌డ‌ము అని క్రికెట్ భాష‌లోని అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌లో మాత్రం వ‌రుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయ‌డాన్ని డ‌బుల్ హ్యాట్రిక్  అనే పేరుతో పిలుస్తుంటారు. ఒక ఓవ‌ర్ చివ‌రి బంతికి వికెట్‌.. ఆ త‌రువాత ఓవ‌ర్‌లో వ‌రుస‌గా మూడు బంతుల్లో మూడు వికెట్లు ఓవ‌రాల్‌గా 1,2,3 లేదా 2,3,4 వికెట్ల‌ను డ‌బుల్ హ్యాట్రిక్ కింద‌ కౌంట్ చేయ‌డం అక్కడి ఆన‌వాయితీ. ఐదు వ‌రుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని కూడా అంటుంటారు. టీ-20 ప్ర‌పంచ క‌ప్‌లో మాత్రం ఈ రికార్డును శ్రీ‌లంక బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ ద‌క్కించుకున్నాడు.  2007లో టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికాపై మలింగ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి డ‌బుల్ హ్యాట్రిక్ సాధించిన తొలి టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ బౌల‌ర్‌గా నిలిచాడు.

 




మరింత సమాచారం తెలుసుకోండి: