భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ ఎంత కీలక ఆటగాడిగా  కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిసారీ టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడూ అద్భుతంగా రాణిస్తూ భారీ పరుగులు చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారి విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా తన ఆటతీరుతో విజృంభిస్తు ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ మైదానంలో కుదురుకున్నాడు అంటే చాలు స్కోర్ బోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది.


 ఆ రేంజ్ లో భారీ స్కోర్లు బాదుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీని రన్ మిషన్ అంటూ పిలుచుకుంటారు ఎంతోమంది అభిమానులు. అంతేకాకుండా మరికొంతమంది రికార్డుల రారాజు అంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకూ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులనూ తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే ఇటీవల సౌతాఫ్రికాలో టీమ్ ఇండియా ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోని లాంటి ఆటగాళ్లను వెనక్కి నెట్టేశాడు. మొదటి వన్డే మ్యాచ్లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు కొట్టేశాడు విరాట్ కోహ్లీ. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో సచిన్ టెండుల్కర్ 5065 పరుగులు చేశాడు. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ 9 పరుగుల వద్ద ఈ రికార్డును దాటేశాడు. ఇక ఆ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ లుగా  ధోని, రాహుల్ ద్రవిడ్ కూడా ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి దిగ్గజ క్రికెటర్  లను కూడా వెనక్కి నెట్టేశాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: