ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ చేజార్చుకున్న టీమ్ ఇండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే కనీసం వన్డే సిరీస్లో అయినా సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరం కావడంతో తాత్కాలిక కెప్టెన్ గా కె.ఎల్.రాహుల్ నియమించారు. కేఎల్ రాహుల్ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగబోతోంది. అయితే మొన్నటి వరకూ కెప్టెన్ గా  కొనసాగిన విరాట్ కోహ్లీ... ఇక ఇప్పుడు ఒక సాధారణ ఆటగాడి గానే జట్టులో కొనసాగుతున్నాడు.


 ఇకపోతే ఇటీవలే భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్లో ఏకంగా 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికా జట్టు మొదటి వన్డే మ్యాచ్ లో విజయం సాధించడంలో కెప్టెన్ బావుమా,   వండర్స్ డస్సేన్ కీలక పాత్ర వహించారు. ఇద్దరు కలిసి ఏకంగా నాలుగో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం అటు సౌత్ఆఫ్రికా జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్ బావుమా సెంచరీతో అదరగొట్టాడు.


 అయితే దక్షిణాఫ్రికా లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బావుమా సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఏకంగా 2016 నుంచి తొలిసారిగా సెంచరీ నమోదు చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెప్టెన్ బావుమా మాతోపాటు వండర్ డస్సేన్  కూడా సెంచరీతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేయగలిగింది సౌతాఫ్రికా జట్టు.  ఈ క్రమంలోనే  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇక చివరికి సౌత్ ఆఫ్రికా జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: