విరాట్ కోహ్లీ టీం ఇండియా టెస్ట్ కాప్టెన్సీ వదిలేసిన తర్వాత దానికి పోటీ బాగా పెరుగుతుంది. తర్వాతి కెప్టెన్ ఎవరు అనే చర్చలో వచ్చే ఆటగాళ్లు అందరూ మేము కాప్టెన్సీకి సిద్ధం అని ప్రకటిస్తున్నారు. ఈ మధ్యే పేసర్ బుమ్రా... తనకు టెస్ట్ కాప్టెన్సీ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ కూడా చేరిపోయాడు. టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు నేడు సిద్దం అని కేఎల్ రాహుల్ అన్నాడు. అది నన్ను ఉత్సాహపరిచే అంశం. కానీ... దాని గురించి అంతగా ఆలోచించడం లేదన్నాడు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం... భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నా శక్తిమేర శ్రమిస్తానని చెప్పాడు. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది ప్రతీ ఆటగాడి కలని, అదో పెద్ద బాధ్యతని తెలిపాడు.

అయితే భారత కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరు అనే చర్చలో ప్రధానంగా కేఎల్ రాహుల్ తో పాటుగా రోహిత్ శర్మ పేరు వినిపిస్తుంది. కానీ రోహిత్ ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా కేఎల్ రాహుల్‌కు టెస్ట్ సారథ్య బాధ్యతలు అప్పగించాలనే అందరూ అంటున్నారు. కానీ కోహ్లీ గైర్హాజరీలో జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండే టెస్ట్‌లో భారత జట్టును నడిపించిన కేఎల్ రాహుల్‌కు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అతని కాప్టెన్సీ తీరు పై మాజీలు.. అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. అయితే ఈ మ్యాచ్‌తో తనకు మంచి అనుభవం వచ్చిందని రాహుల్ తెలిపాడు. ఫలితం అనుకూలంగా లేకున్నా.. ఏన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. ప్రతీ మ్యాచ్ గెలవడమే తన టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం తన దృష్టంతా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ పైనే ఉంది.. అని రాహుల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ దూరం అవ్వడంతో ఈ వన్డే సిరీస్ కు రాహులే నాయకునిగా వ్యరిస్తున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: