గత సంవత్సరం చివర జరిగిన టీ 20 వరల్డ్ కప్ నుండి ఇండియన్ క్రికెట్ టీమ్ ను అపజయం వెంటాడుతూ ఉంది. ఏదో వెలితి కనబడుతోంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా అభిమానులకు వినోదాన్ని పంచడంలో ఫెయిల్ అవుతున్నారు. స్వదేశంలో బాగా రాణిస్తున్నా విదేశీ పర్యటనలో విఫలం అవుతూ ప్రత్యర్థులకు దొరికిపోతున్నారు. 2021 సంవత్సరం చివరిలో సఫారీలతో మూడు టెస్ట్ లు మూడు వన్ డే లు ఆడడానికి దర్జాగా వచ్చారు. మొదటి టెస్ట్ ను అల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో దక్కించుకున్నారు. కానీ రెండవ టెస్ట్ నుండి ఇండియా పతనం స్టార్ట్ అయింది. వరుసగా రెండు మూడు టెస్ట్ లు ఓడిపోయి సిరీస్ ను సఫారీలకు కోల్పోయింది.

స్టార్ ప్లేయర్ లు ఉన్నా కీలక సమయంలో చేతులెత్తేసి చరిత్రలో గుర్తుండిపోయే టెస్ట్ సిరీస్ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ సిరీస్ తో కోహ్లీ సైతం టెస్ట్ కెప్టెన్ గా తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్ కష్టాల్లో ఉంది అని చెప్పాలి. కొంతకాలం వరకు ఇండియా టీమ్ ను ముందుండి నడిపించి టెస్ట్, వన్ డే మరియు టీ 20 లలో ఉత్తమ స్థానంలో నిలబెట్టిన కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడంతో ఇప్పుడు జట్టును నడిపే సారధి ఎవరన్నది సందిగ్ధంలో పడింది. కానీ రోహిత్ నే కెప్టెన్ గా ఉంచాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

కాగా నిన్న ప్రారంభం అయిన మూడు వన్ డే ల సిరీస్ లో సైతం టీమ్ ఇండియా అన్ని విభగాల్లో సమిష్టిగా విఫలం అయ్యి మరో ఓటమిని బహుమతిగా పొందింది. ఈ ఓటములు అన్నిటికీ కారణం కోహ్లీ అని తెలుస్తోంది. ఒకవేళ కోహ్లీ కెప్టెన్ గా ఉంది ఉంటె పరిస్థితి వేరేలా ఉండేది. కొత్త కెప్టెన్ గా వచ్చిన కె ఎల్ రాహుల్ కు అనుభవం లేకపోవడంతో జట్టును విజయం దిశగా నడపలేకపోయాడు. మరి ఇక మిగిలిన రెండు వన్ డే లను గెలిచి వన్ డే సిరీస్ అయినా గెలుస్తుందా లేదా అది కూడా సౌత్ ఆఫ్రికాకే అప్పగిస్తుందా అన్నది తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: