సాధారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్ జరుగుతూ ఉంటేనే క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. అలాంటిది ఇక ప్రపంచ కప్ లో మ్యాచ్ లు అంటే టీవీలకు అతుక్కుపోతుంటారు అందరు. మరీ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అందరి దృష్టి మ్యాచ్ పైనే ఉంటుంది. అప్పటివరకు క్రికెట్ చూడని వాళ్ళు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతుంటారు. కేవలం ఇరు దేశాలకు సంబంధించిన ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అనే చెప్పాలి.


 ఎందుకంటే భారత్ పాకిస్తాన్ ప్రస్తుతం శత్రుదేశాల గా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇక భారత్ పాకిస్తాన్ పై నిషేధం విధించడంతో రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. ఇక ఈ రెండు జట్లు తలపడటం అంటే కేవలం వరల్డ్ కప్ లో  మాత్రమే. అందుకే ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అదే హై వోల్టేజీ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది. ఇక గత ఏడాది కూడా పూర్తిగా టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించిన మ్యాచ్ గా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్  రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మరోసారి భారత అభిమానులందరికీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది.



 ఇటీవలే ఇటీవల 2022 టి20 ప్రపంచ కప్ కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో భాగంగా  పాకిస్తాన్ భారత జట్టు ఒకే గ్రూపులో ఉన్నాయి.. దీంతో ఇక రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగేందుకు అంతా సిద్ధం అవుతోందని తెలుస్తోంది. ఈసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తొలి మ్యాచ్లో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడుతుంది.2021 టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది టీమిండియా. ఇకపోతే టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: