ఒకప్పుడు క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఆటకుదూరమైపోయిన ఎంతోమంది లెజెండ్స్ అందర్నీ కూడా మళ్లీ మైదానంలోకి దింపేందుకు లెజెండ్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలోకి క్రికెట్ ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ లీగ్ చూసేందుకు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన ఆటతీరుతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు ఇక ఇప్పుడు మళ్ళీ మైదానంలోకి దిగుతూ వుండడంతో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది.


 ఇకపోతే ఇండియా మహారాజాస్ జట్టుకు అటు సచిన్ టెండుల్కర్ కెప్టెన్ గా ఉండగా ఇక సచిన్ కరోనా వైరస్ కారణంగా లెజెండ్ క్రికెట్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వీరేంద్ర సెహ్వాగ్ మహారాజస్ టీమ్ను కెప్టెన్గా ముందుకు నడిపిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల లెజెండ్ క్రికెట్ లీగ్లో ఇండియా మహారాజాస్ జట్టు భోని కొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆసియా లయన్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఇండియా మహారాజాస్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఇక టీమిండియా విజయం అందుకోవడం లో యూసుఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా యూసుఫ్ పఠాన్ అయితే మరోసారి బ్యాటింగ్లో తన సత్తా చాటాడు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు.


 కేవలం 40 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు యూసుఫ్ పఠాన్. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.. సిక్సర్లు ఫోర్లు తో చెలరేగిపోయాడు యూసుఫ్ పఠాన్. ఇక అతడు ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 5 సిక్సర్లు ఉండటం గమనార్హం. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత  మహ్మద్ కైఫ్,యూసుఫ్ పఠాన్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దడం లో కీలక పాత్ర వహించారు.  ముఖ్యంగా యూసుఫ్ పఠాన్ అయితే తక్కువ సమయంలోనే ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: